విజయవాడ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం

Spread the love

ఘటనపై విచారణ చేయాలని ఆదేశం
అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు.

అమరావతి:
విజయవాడ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం ముఖ్యమంత్రికి ప్రమాద ఘటనపై వివరాలను అధికారులు అందించారు. ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: