బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం
21 మంది మృతి
9 మంది పరిస్థితి విషమం
20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు
బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా
సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదంలో అనేక మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు సమయంలో మొత్తం 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పేలుడుతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది. పేలుడు శబ్ధం విని స్థానికులు భారీగా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిలో మృతుల బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించగా, వారిలో కొందరిని కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కి తరలించి చికిత్స అందించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న ఇద్దరు క్షతగాత్రులు కూడా మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 23కి పెరిగింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బాణసంచా తయారీ కేంద్రంలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది. తయారీ కేంద్రంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ఈ ఘటనతో వేట్లపాలెం గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బాధితులకు అండగా ఉంటాం
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు కేంద్రం ఇచ్చే నష్టపరిహారం తో పటు రాష్ట్రం తరుపున 20 లక్షల రోపాయల్ ఎక్స్ గ్రేషియా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా , చట్టంలో కఠినమైన మార్పులు తీసుకొస్తామని వెల్లడించారు.సామర్లకోట డిఎస్పీ,ఆర్డీఓ తోపాటు నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు
