
- పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
- జిల్లాలో 33,007 మంది విద్యార్థులు, 178 పరీక్షా కేంద్రాలు
- ప్రతి ప్రశ్నపత్రానికి ఒక క్యూఆర్ కోడ్
- నో మొబైల్ జోన్లుగా పరీక్షా కేంద్రాలు
- జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
ఈనెల 18వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ డిల్లీరావు.. డీఎస్‌ఈవో యూవీ సుబ్బారావు, ఏడీ కేఎన్‌వీ కుమార్‌తో కలిసి పదో తరగతి పరీక్షల నిర్వహణపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మొత్తం 33,007 మంది హాజరుకానున్నారని, వీరిలో బాలురు 17,414 మంది, బాలికలు 15,593 మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో 178 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని.. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు 9 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, ఏవిధమైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి ప్రశ్నపత్రానికి ఒక క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాలన్ని నో మొబైల్ జోన్లుగా ప్రకటించడం జరిగిందన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వేసవి నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని.. మంచినీటిని అందుబాటులో ఉంచడంతో పాటు ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడిరచారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విద్యార్థులు హాల్ టికెట్‌తో ఆర్‌టీసీ బస్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. గుర్తించిన రూట్లలో ప్రత్యేక బస్సులు నడవనున్నట్లు వెల్లడిరచారు. విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లో ఒక రోజు ముందే పరీక్షకేంద్రాలను చూసుకుంటే బాగుటుందన్నారు. అయిదు ఫ్లయింగ్ స్వ్కాడ్లతో పాటు 12 మంది రూట్ అధికారులు ఉంటారన్నారు. డీఈవో కార్యాలయంలో 9154473676 నంబర్‌తో కంట్రోల్ రూం ఉంటుందని వెల్లడిరచారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఏపీవోఎస్‌ఎస్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతాయని.. ఈ పరీక్షలకు 5,495 మంది హాజరవుతారని, వీటి నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గతేడాది కంటే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెబుతూ వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో పదో తరగతి పరీక్షలను విజయవంతంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు.