రాబోయేది కురుక్షేత్ర యుద్ధం

గతంలో పేదవాడి గురించి , ఎలా బతుకుతాడనే ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదని ,మంచిచేయకపోగా పేదవారిని అవమానించిన చరిత్ర కూడా ఉందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసారు. తానూ అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని,.మీ ఇంట్లో మంచి జరిగిందా? అనేది కోలమానంగా తీసుకొని . ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ఈ . రోజు కర్నూలు,ఎంమాగనూరు లో జరిగిన బహిరంగ సభలో ఆయన జగనన్న చేదోడు పథకం క్రింద 325 కోట్ల రూపాయల నిధులను బటన్ నొక్కి లభ్దిదారుల ఖాతాలో జమచేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాల జరగనున్నాయని తెలిపారు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ కురక్షేత్ర సంగ్రామం కులాల మధ్య కాదు.. ఇది క్లాస్ వార్ అని, పేదవాడు ఒకవైపు.. పెత్తందారు ఒకవైపు ఉండి యుద్ధం జరగబోతోందని ప్రకటించారు. రాజధాని అంశంలో నిసిగ్గుగా పేదవాడికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసిన చంద్రబాబు ఒకవైపు, మరోవైపు ప్రతీ వర్గం నాది అనుకునే మీ బిడ్డ ప్రభుత్వం నిలబడ్డాయని అన్నారు. మిమ్మల్ని తప్ప ఎవరినీ నమ్ముకోలేదు. ఓటు వేయడానికి వెళ్లే ముందుకు ఒక్కటే ఆలోచన చేయండి.మంచి జరిగితే తనకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
గతమంతా మోసమే
అదే గతంలో చంద్రబాబు పాలన చూస్తే.. కుప్పంలో ప్రజలకు కూడా చంద్రబాబు మా వాడు అని చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. . ఆ కుప్పంలో పేదవాడికి ఇంటి స్థలం కావాలంటే.. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే.. 20 వేల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సీఎం జగన్ తెలిపారు. అప్పట్లో బాబు ముఖ్యమంత్రి అయితే.. ఏదో జరుగుతుందని అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చారు. రైతులకు రుణమాఫీ ప్రచారం చేసుకున్నారు. రూ.87, 012 వేల కోట్లు రూపాయలు రుణ మాఫీ చేస్తానన్నారు. కానీ, అధికారంలోకి రాగానే సున్నావడ్డీ పథకం ఎత్తేశారని ఎద్దేవా చేసారు. బాబు హయాంలో పొదుపు సంఘాలు విలవిల్లాడిపోయాయి. రుణమాఫీ రూ. 5వేల కోట్లు కూడా చేయలేదని విమర్శించారు. బాబు హయాంలో స్కిల్‌స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, చివరకు.. మద్యం కొనుగోళ్లలో కూడా దోచేయడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకున్నది తినుకోవడం.. ఇది తప్ప ఏదీ కనిపించలేదని ఆరోపించారు. . జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. జాబు రావాలంటే బాబు రావాలన్నారు.. చివరకు నిరుద్యోగల్ని మోసం చేశారు. అన్నింటా చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని విమర్శలు గుప్పించారు.
కోటిమందికి సంక్షేమం అందించాం
ఈ నాలుగు సంవత్సరాల్లో రూ.2 లక్షల 38వేల కోట్ల రూపాయలు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడ్డాయని జగన్ గుర్తు చేసారు. . 3 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరిందన్నారు. మ్యానిఫెస్టోలో 2019 లో మ్యానిఫెస్టోలో పెట్టిన 99 శాతం అమలుచేశామన్నారు. . జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందిరీక ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. 31 లక్షలు ఇంటి స్థలాలు,పట్టాలు అందించామన్నారు.దాదాపు మంది కోటి మంది ప్రజలకు లబ్ది చేకూర్చామన్నారు.