మరికొన్ని అరెస్టులుంటాయి

Spread the love

మరికొన్ని అరెస్టులుంటాయి.
చంద్రబాబు అరెస్టు పై జగన్ ఆరా
శాంతి భద్రతలపై జగన్‌ సవిూక్ష
విజయవాడ, సెప్టెంబర్‌ 12
స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తో పలు పార్టీలకు చెందన నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో నేడు ( మంగళవారం ) విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సవిూక్ష సమావేశం నిర్వహించారు. గత పది రోజులుగా జరిగిన పరిణామాలను సీఎం జగన్‌ కు కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి సహా పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు వివరించారు.ఇక, చంద్రబాబు అరెస్ట్‌ తదనంతర పరిణామాలను ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి సీఎం జగన్‌ కు వివరించారు. కోర్టులో జరిగిన వాద ప్రతివాదనల తీరును పోన్నవోలు వివరించారు. చంద్రబాబు అరెస్ట్‌ సందర్భంగా టీడీపీ చేపట్టిన ఆందోళనలు.. నిన్నటి బంద్‌ వంటి అంశాలను సీఎం జగనుకు పోలీస్‌ అధికారులు తెలియజేశారు. మరి కొంత మంది అరెస్టులు ఉంటాయనే ప్రచారంతో సీఎం జగన్‌ లా అండ్‌ ఆర్డర్‌ రివ్యూ ప్రాధాన్యత సంతరించుకుందిఅయితే, భవిష్యత్‌లో రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు క్వాష్‌ పిటీషన్‌స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కాం లో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ను కొట్టేయాలని ఆయన తరపున న్యాయవాదులు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసు విచారణ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. రిమాండ్‌ ను సవాల్‌ చేస్తూ వేసిన రివ్యూ రివిజన్‌ పిటిషన్‌ లోనే క్యాష్‌ పిటిషన్‌ కూడా కలిపి వేసిన చంద్రబాబు తరపు లాయర్లు.అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై రాజకీయ కోణంతోనే కేసు పెట్టారని ఆయన తరపు లాయర్లు క్యాచ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక, రేపు కోర్టు నంబర్‌ 4లో ఈ కేసు విచారణకు రానుంది. ఈ పిటిషన్‌ కు సంబంధించి చంద్రబాబు సంతకం కావాల్సి ఉండటంతో అందకని రాజమండ్రి సెంట్రల్‌ జైల్లుకి ఏపీ హైకోర్టు అడ్వకెట్‌ లక్ష్మీ నారాయణ వెళ్లి కలినట్లు తెలుస్తుంది. ఆ సంతకాల ప్రక్రియ ముగిసిన తర్వాత తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు. ఈ కేసులో జస్టిస్‌ శ్రీనివాస్‌ రెడ్డి ధర్మాసనం ముందుకు రానుంది.17ఏ ప్రకారం రాష్ట్ర గవర్నర్‌ అనుమతి లేకుండా చంద్రబాబును ఎలా రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలిస్తారని ఈ పిటిషన్‌ లో చంద్రబాబు తరపు లాయర్లు పేర్కొన్నారు. ఇక, ఈ రెండు అంశాలకు సంబంధించి రేపు ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది. ఇది కూడా ఈ కేసులో కీలకమైనది. ఇప్పటి వరకు చంద్రబాబుకు సంబంధించిన అన్ని కేసులు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంటే.. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత తొలి సారి ఏపీ హైకోర్టుకు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: