
16 న ఎన్నికల షెడ్యూల్
సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్దమయింది.మార్చి 16 న మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.మొత్తం 5 లేదా 7 విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఇక తాజాగా ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సంధు బాధ్యతలు స్వీకరించారు.దీంతో ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది.
ప్రతి రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై జాతీయ సర్వేను పూర్తి చేసిన ఈసీ తాజాగా జమ్ముకశ్మీర్ పర్యటనతో తన సర్వేను ముగించింది. 543 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. లోక్‌సభ ఎన్నికల కు సంబంధించి బీజేపీ ఇప్పటివరకు 267 మంది అభ్యర్థులతో రెండు జాబితాలను విడుదల చేయగా, కాంగ్రెస్ రెండు జాబితాల్లో 82 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
ఏపీలో ఏప్రిల్ లో 2వ వారంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగవచ్చు.అధికార,ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్ధులను ఇప్పటికే ప్రకటించాయి.మిగిలిన నియోజక వర్గాల్లో ఈ రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.